ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు మార్గం సుగుమం చేస్తూ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ‘రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి’ పిలుపు మేరకు ‘భారత్ బంద్’ కొనసాగుతోంది. అయితే రాజస్థాన్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను బంద్ ప్రభావం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు సైతం యథావిథిగా నడుస్తున్నాయి.