ఎగువ ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజి నుండి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుండి 35వేల 727 క్యూసెక్కుల వరద నీరు మంగళవారం ప్రకాశం బ్యారేజి వద్దకు చేరుతున్నట్టు నీటిపారుదల శాఖ జేఈ అజముద్దీన్ తెలిపారు. బ్యారేజి రిజర్వాయర్లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా 25 గేట్లను 1 అడుగు వంతున ఎత్తి దిగువకు 18వేల 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 17వేల 477 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు జేఈ తెలిపారు.