వైసీపీకి చెందిన వ్యక్తులు తనపై అత్యాచారయత్నం చేయడంతోపాటు చంపాలని కూడా ప్రయత్నించారని, ఊరు విడిచి వెళ్లకపోతే ప్రాణాలు దక్కవని అప్పటి డీఎస్పీ చైతన్య తననే బెదిరించారని అన్నమయ్య జిల్లాకు చెందిన సరోజ అనే మహిళ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. వైసీపీ గుండాలపైనా, వారికి కొమ్ము కాసిన పోలీస్ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ మద్దతుదారుల ప్రోద్భలంతో ఎస్సై, కానిస్టేబుళ్లు తమను కొట్టి హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా శింగనమల మండలం సలకం చెరువుకు చెందిన దళితులు తాడి మేరి తిరపాలు, రాజా రాముడు విజ్ఞప్తి చేశారు.