అనంతపురం నగరంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. బుధవారం భారీ వర్షం నేపథ్యంలో ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఉదయం నుంచి పలు కాలనీలలో పర్యటించి, రోడ్లపైకి, ఇళ్లలోకి వచ్చిన వర్షపు నీరు రావడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా ఆయన చొరవ తీసుకున్నారు. ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం అని అన్నారు.