తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి , సతీమణి సురేఖ దంపతులు గురువారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిరంజీవి దంపతులు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే దంపతులు వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఇంట్లో కేక్ కట్ చేయించారు.