డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటలకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ఫోన్ ద్వారా నియోజకవర్గ ప్రజల నుండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీ శానిటేషన్ వంటి పలు రకాలైన సంస్థలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులు సకాలంలో వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు. ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది