ముగ్గురు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులోకి ఎక్కించి హైవే పైకి వెళ్లారు. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 20న ఉదయం 6 గంటలకు 16 ఏళ్ల బాలిక మలవిసర్జన కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ బాలిక నివసించే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకుని హైవేపై డ్రైవ్ చేశారు. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను బెదిరించి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు.కాగా, బయటకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం చుట్టుపక్కల వెతికారు. చివరకు ఇంటికి చేరుకున్న ఆ బాలిక జరిగిన సంగతి తన తల్లికి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.