రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టడం రాజకీయ నాయకులకు తంతుగా మారింది. ఆంధ్రప్రదేశ్లో నిన్న, మొన్నటి వరకు ఐదేండ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నేడు అధికారం కోల్పోవడంతో కూటమిలోకి వరుస కడుతున్నారు. విశాఖలో సుమారు 15 మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీలోకి మారిని సంగతి తెలిసిందే.తాజాగా విజయవాడలోనూ వైసీపీ నాయకులు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. గురువారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ముగ్గురు కార్పొరేటర్లు మైలవరం రత్నకుమారి, మైలవరం లావణ్య, హర్షద్తో పాటు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ నగరం అభివృద్ధి కోసం అనేక మంది టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడలో విపక్షపార్టీలకు కార్యకర్తలు దొరకడం కష్టమని పేర్కొన్నారు.