విశాఖ జిల్లాలోని సింహగిరిపై వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య కళ్యాణం గురువారం వైభవంగా నిర్వహించారు. స్వామితో పాటు ఉభయదేవేరులను మండపంపై అధిష్టింపజేసి కళ్యాణ క్రతువును అర్చక స్వాములు చేపట్టారు. మంగళ వాయిద్యాలు నడుమ జీలకర్ర బెల్లం, తలంబ్రాలు ప్రక్రియ చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి నిత్య కళ్యాణాన్ని తిలకించారు.