ముస్లిం మైనారిటీ ప్రతినిధులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ముస్లిం మైనారిటీల సమావేశలపై ప్రతినిధులతో చర్చించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాఫీజ్‌ఖాన్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.