అచ్యుతాపురం ఎస్.ఇ. జెడ్‌లోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యానారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఆవేదన వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వ తీరు బాధ్యతా రాహిత్యంగా ఉందని విమర్శించారు. రేపు (శుక్రవారం) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ బాధిత కుటుంబాలను కలుస్తారని తెలిపారు. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. 24 గంటలు అయినా జిల్లా ప్రజా ప్రతినిధులు కనిపించటం లేదన్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. పరిహారం చెక్కులు ఇచ్చిన తర్వాతే డెడ్ బాడీస్ తరలించాలన్నారు. గతంలో ఎల్.జి పాలిమర్స్ ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ వెల్లడించారు.