ఓడిశా అడవుల్లో వేగంగా వస్తున్న గూడ్సు రైలు కింద ఆడ ఏనుగు పడి మరణించిన ఘటన దెన్ కనాల్ అడవుల్లో బరాదా లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగింది. రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఓ ఆడ ఏనుగు రైలు పట్టాలను దాటుతుండగా ఓ గూడ్సు రైలు వేగంగా వచ్చింది. దీంతో రైలు కిందపడి ఏనుగు అక్కడికక్కడే మరణించింది. రైళ్ల వేగపరిమితిపై అటవీశాఖ అధికారుల నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని రైల్వే డీఆర్ఎం మోహన్ అగర్వాల్ చెప్పారు. గత ఏడాది నవంబరులో హైటెన్షన్ వైర్లు తగిలి ఓ ఏనుగు మరణించింది. 2009 నుంచి 2017 వరకు విద్యుత్ ఘాతం, రైళ్ల కిందపడి 655 ఏనుగులు మరణించాయని పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa