వాతావరణ మార్పులతో జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున గ్రామాల్లో వైద్య పరీక్షలను ముమ్మరం చేసినట్లు ఏలూరు జిల్లా, పెదపాడు పీహెచ్సీ వైద్యాధికారి చక్రధర్ తెలిపారు. తోటగూడెం వైద్యశిబిరాన్ని గ్రామ కార్యదర్శి వెంకటేశ్వరరావుతో కలిసి సమీక్షించారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. జ్వరం వస్తే వైద్యులను కలవాలని సూచించారు.