ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 04:09 PM

కృష్ణా జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ నిధి మీనాతో కలిసి జాతీయ రహదారులు రైల్వేలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు భూ సేకరణ ప్రక్రియపై కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఎన్‌హెచ్‌-165 జీ-గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌, ఎన్‌హెచ్‌ఏఐ-216 హెచ్‌(పెడన-విసన్నపేట), ఎన్‌హెచ్‌-16 (బెంజిసర్కిల్‌ సర్వీసురోడ్డు), ఎన్‌హెచ్‌-65 (నందిగామ-కంచికచర్ల బైపాస్‌), ఎన్‌హెచ్‌-221 (విజయవాడ-భద్రాచలం), ఎన్‌హెచ్‌-65 (విజయవాడ-హైదరాబాద్‌ సెక్షన్‌)లకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై ఆమె చర్చించారు. భూ సేకరణ విస్తీర్ణం, అవార్డు పాస్‌ వివరాలతో పాటు ప్రస్తుతం ప్రక్రియ ఏ దశలో వుందనే వివరాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల ఆర్డీవోలు, తహసీల్దార్లతో చర్చించారు. గడువులోగా ప్రక్రియను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా రైల్వేలో బిజీ లైన్లు, ఆర్‌ఓబీలు, డబ్లింగ్‌ పనులు తదితరాలకు సంబంధించి భూ సేకరణకు ఇప్పటివరకు వచ్చిన అభ్యర్థనలు, రావాల్సిన వాటిపైనా సమావేశంలో చర్చించారు. సేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవోలు బీహెచ్‌ భవానీశంకర్‌, ఎ.రవీంద్రరావు, కలెక్టరేట్‌ ల్యాండ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వే అధికారులు, సంబంధిత తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com