అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువక ముందే పరవాడ ఫార్మా సెజ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో ప్రమాదం జరిగింది. నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పరవాడ ఫార్మా సెజ్‌ల జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై సైతం చంద్రబాబు ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను చంద్రబాబు ఆదేశించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. వారికి ప్రస్తుతం ఓ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్ లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు.