ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారులో హెల్మెట్ పెట్టుకోవాలా.. లేకపోతే రూ.1000 ఫైన్ వేస్తారా

national |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:55 PM

కార్లలో సీట్ బెల్టు పెట్టుకోలేదని.. ఓవర్ స్పీడ్‌గా వెళ్లారని.. ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించలేదని ఫైన్లు వేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇక బైక్‌లకు అయితే హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు.. ఫోటో కొట్టి చలాన్లు వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని చలాన్ విధించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే తన కారుకు చలాన్ పడింది గుర్తించిన సదరు ఓనర్ అవాక్కయ్యాడు. వెంటనే దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ కాస్తా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ ఘటనపై సదరు ట్రాఫిక్ పోలీసులను తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు చెందిన తుషార్ సక్సేనాకు.. నోయిడా ట్రాఫిక్ పోలీసుల నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో హెల్మెట్ పెట్టుకోనందుకు రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు ఉంది. అంతవరకు బాగానే ఉన్నా.. అతడు ప్రయాణించింది బైక్‌పై కాదు.. కారులో. అదేంటీ కారులో కూడా హెల్మెట్ పెట్టుకోవాలా.. లేకపోతే ట్రాఫిక్ చలాన్ విధిస్తారా అనే అనుమానం కలుగుతోంది. అది చూసిన తుషార్ సక్సేనా.. ఏదో పొరపాటున జరిగింది అని ఊరుకున్నాడు. అయితే ఆ తర్వాత పదే పదే నోయిడా ట్రాఫిక్ పోలీసుల నుంచి మెసేజ్‌లు, ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో తీవ్ర అసహనానికి గురైన తుషార్ సక్సేనా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.


అయితే ఈ విషయాన్ని నోయిడా ట్రాఫిక్ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. తన సమస్య పరిష్కారం కాలేదని తుషార్ సక్సెనా తీవ్రంగా వాపోయాడు. పైగా ఆ జరిమానా చెల్లించకపోతే కోర్టుకు రావలసి ఉంటుందని నోయిడా ట్రాఫిక్ పోలీసులు తనను హెచ్చరించారని కూడా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో నోయిడా ట్రాఫిక్ పోలీసులకు తుషార్ సక్సేనా పలు ప్రశ్నలు వేశాడు. కారులో హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి తనకు విధించిన జరిమానాను రద్దు చేయాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులకు తుషార్ సక్సేనా విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com