వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలోని బాలాజీ నగర్ లో మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక మహిళను మంగళవారం ఉదయం వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు అరెస్టు చేసి 45 మద్యం సీసాలను స్వాధీన పరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలో ఎక్కడా మద్యం బెల్ట్ దుకాణాలు ఎవరూ నడపరాదని, నిరంతరం దాడులు నిర్వహిస్తామని ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరించారు.