చీరాల లారీ యజమానుల సంఘం భవనం అక్రమ నిర్మాణం పై మంగళవారం చీరాల ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి, తహసీల్దార్ గోపికృష్ణ విచారణ చేపట్టారు. ఈ భవనాన్ని అసైన్డ్ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించి, మున్సిపాలిటీకి పన్నులు కూడా కట్టకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని వల్లెపు బాల అంకమ్మరావు అనే లారీ యజమాని చేసిన ఫిర్యాదు ఆధారంగా కలెక్టర్ వెంకట మురళి తక్షణ విచారణకు ఆదేశించడంతో రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది.