మగ శిశువు జననానికి కారణమయ్యే వై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధానమవుతోందని ఓ అధ్యయనం తేల్చింది. అయితే, స్పైనీ ర్యాట్ జాతి ఎలుకలు దాని వై క్రోమోజోమ్ అంతర్ధానమైనందున, అవి మరో కొత్త మగ జన్యువును అభివృద్ధి చేసుకున్నాయని కూడా ఆ అధ్యయనం తెలిపింది. రాబోయే లక్షల సంవత్సరాలలో మన సొంత వై క్రోమోజోమ్ కనుమరుగు అయ్యే అవకాశం ఉన్నందున, ఈ పరిశోధన మానవ మనుగడకు కొత్త ఆశను అందించింది.