శ్రీకాకుళం జిల్లా,హిరమండలం పరిధిలోని మేజర్ పంచాయతీ మైత్రీ కాలనీకి చెందిన జోగి దుర్గాప్రసాద్ (24) వంశధార కుడి కాలువలో దూకి గల్లంతయ్యాడు. స్థానికులు, పో లీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దుర్గాప్రసాద్ తరుచూ తల్లితో గొడవపడుతుండేవాడు, తల్లి సా విత్రమ్మ సోమవారం మందలించింది. దీంతో క్షణి కావేశంతో పెద్దకోరాడ వీధి సమీపంలో ఉన్న వంశ ధార కుడి కాలువలో దూకాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా., ఫలితం లేక పోయింది. కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గల్లంతయ్యాడు. వెంటనే స్థానికులు పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంతో కొత్తూరు సీఐ చింతాడ ప్రసాద్, ఎస్‌ఐ నారాయణస్వామి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో గాలింపు చర్యలకు వీలులేకుండా పోయింది. దీంతో వంశధార అధికారులకు సమాచారం అందించి కాలువ గేట్లు మూసి వేయించారు. కొత్తూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రాత్రి కావడంతో మంగళవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. దుర్గా ప్రసాద్ తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోగా తల్లి సావిత్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ ప్రసాద్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa