విశాఖ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం నుంచి వచ్చే నెల నాలుగో తేదీ నుంచి స్వీయ మదింపు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి ప్రతిరోజు ప్రశ్నపత్రాలు పంపిస్తారు. తొలిరోజు మంగళవారం సింహాచలంలో ఓరియంటల్ పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు, 28వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగోతేదీ నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ప్రశ్నపత్రాలు లీకేజీకి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సంబంధిత యాజమాన్యాలు నిర్వహిస్తాయి.