వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. కాసేపట్లో రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తామని తెలిపారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు మోపిదేవి ప్రకటించారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్మకం ఉందన్నారు. ఆయన వంటి అనుభవజ్ఞుడితో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని తెలిపారు.