మాలీవుడ్‌పై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను ఉద్దేశించి నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మహిళలు పనిచేసే ప్రతీ విభాగంలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లాంటి కమిషన్ ఉండాలి. స్త్రీ ఎప్పుడూ స్వతంత్రంగా నిలబడాలి. ఏ సందర్భంలోనూ ఆమె రాజీ పడకూడదు’’ అని పేర్కొన్నారు.