రాజకీయ అనిశ్చితితో తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్న బంగ్లాదేశ్ ప్రపంచ బ్యాంకు సాయం కోరింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు సద్దుమణిగినట్లు తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక మద్దతు కోసం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఏబీడీలు తమకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 8 బిలియన్ అమెరికన్ డాలర్లు సమకూర్చాలని కోరింది.