రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గురించి స్మృతి ప్రస్తావిస్తూ..‘రాజకీయంగా రాహుల్ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఎంతో పరిపక్వతతో మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో అలా మాట్లాడటం ఎంతో కీలకం. ఇదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా భిన్నమైన రాజకీయం చేస్తున్నట్లు మాత్రం అనిపిస్తోంది’ అంటూ పాజిటివ్ కామెంట్స్ చేశారు.