ఎవరూ చేయని విధంగా తన ప్రియుడికి మ్యారేజ్ ప్రపోజ్ చేసిందో యువతి. కొత్తగా ట్రై చేయాలని ఏకంగా విమానం గాల్లో ఉండగా పెళ్లిచేసుకుందామా? అంటూ లవర్‌కు గ్రాండ్ ప్రపోజ్ చేసింది. దీని గురించి అతనికి చెప్పకుండా సర్పైజ్ ఇవ్వడంతో అతనూ షాక్ అయ్యాడు. దీనిపై ఇండిగోను సంప్రదించగా సానుకూలంగా స్పందించిందని, స్నేహితుల సహాయంతో ఇది చేయగలిగానని ఆమె పేర్కొంది.చంఢీగఢ్ రాష్ట్రానికి చెందిన ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐశ్వర్య బన్సల్ తన ఇన్ స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. తన ప్రేమను తన ప్రియుడికి తెలిపి పెళ్లికి ఇండిగో ఫ్లైట్‌లో ప్రపోజ్ చేసింది. ఈ అందమైన క్షణాన్ని ఐశ్చర్య బన్సాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ అమూల్య గోయల్‌తో కలిసి ఐశ్వర్య ఇండిగో ఫ్లైట్‌లో ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్లాన్ ప్రకారం.. ఫ్లైట్‌లో ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. ఇంతలో ఐశ్వర్య నడుచుకుంటూ వస్తుంది. అమూల్య గోయల్ ముందు ఐశ్వర్య బన్సాల్ మోకాళ్లపై కూర్చుంటుంది. ఆమె చేతిలో ఉన్న ఉంగరాన్ని అమూల్య గోయల్ కు తొడిగి ప్రపోజ్ చేస్తుంది. ఇంతలో ఆమె వెనుక కొందరు వ్యక్తులు ప్లకార్డులు పట్టుకుని నిలబడతారు. ఆ పోస్టర్లపై విల్ యూ మ్యారీ మీ (మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?) అని రాసి ఉంది.