‘సీడ్ క్యాపిటల్లో మొత్తం 14.46 ఎకరాల్లో జీ ప్లస్ 18 అంతస్తులు ఉండేలా మొత్తం 12 టవర్లను నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ఆన్లైన్లో బుకింగ్ ప్రారంభించగానే కేవలం గంటలోనే అన్ని ప్లాట్లు బుక్ అయిపోయాయి. దీంతో రూ.714 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రూ.930 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ ప్లాట్లు బుక్ చేసుకున్న వారు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని మంత్రి నారాయణ తెలిపారు.