కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం వారం, పది రోజుల వ్యవధిలో ప్రకటించనుంది. ప్రభుత్వ మద్యం షాపుల పాలసీ సెప్టెంబరుతో ముగుస్తుంది. అక్టోబరు 1 నుంచి ప్రైవేటు షాపుల పాలసీ అమల్లోకి వస్తుంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, లాటరీ ప్రక్రియను 20 రోజుల్లో పూర్తిచేసేలా షెడ్యూలు రూపొందిస్తున్నారు. మరోవైపు సెప్టెంబరు 5 నుంచి ఎక్సైజ్‌లో బదిలీలు ప్రారంభం కావాలి. ఈలోగా ఎక్సైజ్ శాఖ పునర్‌వ్యవస్థీకరణ జీవోలు విడుదల చేయాలి. ఒకేసారి అటు బదిలీలు, ఇటు కొత్త పాలసీ అంటే ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు ప్రస్తుతానికి సిబ్బందిని సర్దుబాటు చేసి పాలసీ ప్రక్రియ ముగించాలని భావిస్తున్నారు. పాలసీ అమల్లోకి వచ్చాక బదిలీలు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నారు.