కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన ప్రభుత్వ వైఫల్యం అని, కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు పెట్టడం అత్యంత దారుణమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. దీని వల్ల తీవ్ర ఆందోళనలో విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు ఉన్నారన్న ఆయన, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ సర్వనాశనం అయిందని చెప్పారు. వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.