ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. శనివారం ఉదయం పాతపట్నం మండలంలోని తిడ్డిమి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లు అంద చేస్తున్నారని గుర్తు చేశారు. నేడు ఒక పండుగ వాతావరణం లో పింఛన్లు కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.