విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 34 వార్డు పరిధిలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నీలం రాజు రూ.లక్ష సొంత నిధులతో 3 తోపుడు బండ్లను, 2 బడ్డిలను, 2 విజ్ సైజ్ గొడుగులను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా శనివారం చిరు వ్యాపారులకు అందజేశారు. ఈ సందర్భంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న రాజును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభినందించారు.