అనకాపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ శనివారం తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రెవెన్యూ డివిజినల్ అధికారి, అనకాపల్లి, నర్సీపట్నం కార్యాలయాలలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ల ద్వారా సహాయం పొందవచ్చన్నారు.