గుత్తి చెరువుకు వర్షం నీరు భారీగా చేరుతోంది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గుత్తి చెరువులోకి వర్షం నీరు చేరుతుండగా ఆదివారం నాటికి సుమారు 40 శాతం చెరువు నిండినట్లు ఆయకట్ట రైతులు, ఇరిగేషన్ అధికారులు చెప్పారు. గుత్తి చెరువులోకి నీళ్లు రావడంతో చుట్టుపక్కల బోర్లలో నీరు సమృద్ధిగా లభిస్తుంది. చెరువులోకి వర్షం నీరు రావడంతో ఆయకట్ట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.