ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను అసభ్యకరంగా తాకాడు .. పశ్చిమ్​ బెంగాల్​లో మరో దారుణం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 02, 2024, 12:49 PM

కోల్​కతా వైద్యురాలి రేప్​, హత్య సంఘటనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పశ్చిమ్​ బెంగాల్​లో మరో దారుణం చోటుచేసుకుంది. బీర్​భూమ్​లోని ఓ హాస్పిటల్​లో నైట్​షిఫ్ట్​లో ఉన్న ఓ నర్స్​పై ఓ రోగి లైంగిక దాడికి పాల్పడ్డాడు.పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.బీర్​భూమ్​లోని ఇలమ్​బజార్​ హెల్త్​ సెంటర్​లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. చికిత్స నిమిత్తం, నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్​కి వెళ్లాడు. అక్కడ, నర్స్​తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనకి సెలైన్​ ఎక్కిస్తుండగా నర్స్​ని పట్టుకున్నాడు.ఎమర్జెన్సీ వార్డులో రోగికి సాయం చేస్తుండగా, అతను తన మీద లైంగిక దాడికి పాల్పడినట్టు నర్స్​ వెల్లడించింది.


"అతను నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వైద్యుడు చెప్పినవి నేను చేస్తుంటే, అతను నా ప్రైవేటు భాగాలను ముట్టుకున్నాడు. నన్ను అసభ్యకరంగా దూషించాడు," అని తనకు జరిగిన విషయాన్ని ఆ నర్స్​ వెల్లడించింది."హాస్పిటల్స్​లో భద్రత లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. లేకపోతే కుటుంబ సభ్యుల సమక్షంలో, డ్యూటీలో ఉన్న నర్స్​తో ఒక రోగి ఈ విధంగా ఎలా ప్రవర్తించగలడు? అతడిని అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నించలేదు," అని నర్స్​ వివరించింది.తాజా ఘటనతో హెల్త్​ కేర్​ సెంటర్​ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్పిటల్​ వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పూర్తి సమాచారాన్ని సేకరించి, నిందితుడిని అరెస్ట్​ చేశారు.కోల్​కతా వైద్యురాలి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, పని ప్రదేశాల్లో డాక్టర్లు, మరీ ముఖ్యంగా మహిళా వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో బెంగాల్​లో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. సమస్యకు పరిష్కారం ఏంటి? అనేది అన్ని వర్గాల వారు ఆలోచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com