ఏపీలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని ప్రతీ ఒక్క లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు ఈ నెల లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనర్హులు అయ్యివుండి పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి పెన్షన్ ను రద్దు చేయటం జరుగుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు.