జామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి సామ్రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలో గల ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బందికి ఫీవర్ సర్వై ఫై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు ప్రజలు గురవుతున్న మేరకు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.