పర్యటించి, పునరావాస కేంద్రాల్లోని ముంపు బాధిత ప్రజలతో మాట్లాడుతూ వసతులపై ఆరా తీసిన తెదేపా నాయకులు.జెసిబి సాయంతో ప్రమాద భరితంగా ప్రవహిస్తున్న బుడమేరు వంతెన దాటిన టిడిపి నేతలు.ప్రధానంగా బుడమేరు వరద ఉధృతితో ముంపునకు గురైన పుట్టగుంట, పెద లింగాల, చిన లింగాల, చేదుర్తిపాడు, ఓద్దుల మేరక గ్రామాల్లో గుడివాడ నియోజకవర్గ టిడిపి నాయకుడు కామేపల్లి తులసి బాబు పలువురు ప్రజా ప్రతినిధులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన నేతలు బుడమేరులో ప్రస్తుత నీటి ఉధృతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల వారిగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లిన నాయకులు అక్కడ ముంపు బాధిత ప్రజలకు అందిస్తున్న వసతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముంపు బాధిత ప్రజలతో టిడిపి నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు ఆదేశాల మేరకు తాము సమస్యాత్మక గ్రామాల్లో పర్యటిస్తున్నామని ప్రజలెవరు ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూటమి పార్టీల నేతలందరం అండగా ఉంటామని ముంపు బాధిత ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎగువ నుండి వస్తున్న వరద నీటి ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎటువంటి సహకారం కావాలన్నా పార్టీ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉంటుందని టిడిపి నేత తులసి బాబు అన్నారు.బాధిత గ్రామాల్లో పర్యటించేందుకు ప్రమాదభరితంగా ప్రవహిస్తున్న బుడమేరు వంతెనను జెసిబి సహాయంతో టిడిపి నాయకులు దాటారు.నియోజకవర్గంలో వరద పరిస్థితిపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని గ్రామాల వారీగా కూటమి పార్టీల నేతలను కూడా అప్రమత్తం చేస్తూ బాధిత ప్రజలకు అండగా ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చినట్లు టిడిపి నాయకులు తెలియజేశారు.టిడిపి నేతల పర్యటనలో ఆ పార్టీ నాయకులు చేకూరు జగన్మోహన్రావు, సింగల రాధాకృష్ణ, మల్లిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,అందుగుల ఏసు పాదం, యార్లగడ్డ రవి, చాట్రాగడ్డ రవి,ప్రదీప్,సత్య సాయి, గోవాడ శివ, డిప్యూటీ తాసిల్దార్ మల్లికా, ఆర్ ఐ గణేశ్ మరియు రెవెన్యూ , సచివాలయల ఉద్యోగులు పాల్గొన్నారు.