సీఎం చంద్రబాబు, తాను ఆ పదవిలో కూర్చోవడానికి అసలు అర్హుడినేనా? అని ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని, ఇప్పుడు విజయవాడ విపత్తుకు ముమ్మాటికి చంద్రబాబు తప్పిదమే కారణమని, అందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ స్పష్టం చేశారు. విజయవాడ వరదలకు ఇప్పటికే 32 మంది బలి అయ్యారన్న ఆయన, ఇంకా ఎందరు చనిపోయారో లెక్క తెలియడం లేదని, మరోవైపు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని వెల్లడించారు. తన తప్పు కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు, నెపాన్ని అధికారులపై నెడుతున్నారన్న ఆయన, నిజానికి అన్ని అనర్ధాలకు కారణం చంద్రబాబే అని తేల్చి చెప్పారు.