సీఎం రిలీఫ్ ఫండ్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ,పెమ్మసాని రవిశంకర్ వారి ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబుకు పెమ్మసాని చెక్కును అందజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రూ. కోటి చెక్కును అందజేశారు.