ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దర్యాప్తు అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారన్నారు.
బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3బోట్లు ఉన్నాయని చెప్పారు. లంగర్ వేయకుండా 3బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారన్నారు. బోటు యజమాని YCP నేత కావడం కుట్ర కోణాన్ని బలపరుస్తోందని చెప్పారు.