కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నేడు సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును వచ్చేవారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
నివేదిక సమర్పించేందుకు వారం సమయం ఇస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.