వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి డ్రోన్లను ఉపయోగించాలన్నారు. కాలువల్లో వరద ప్రవాహాలు, గట్ల పటిష్ఠతను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశించారు.