శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని రామగిరి మండల పరిధిలోని సుద్ధకుంటపల్లి గ్రామంలో తుపాకీతో వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో రాజీకు రావాలని గన్తో బెదిరింపులకు గంగాధర్ అనే వ్యక్తి దిగాడు. బాధితులు సదరు వ్యక్తిపై తిరగబడ్డారు. బాధితులు గంగాధర్పై రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుద్ధకుంటపల్లిలో మహిళా ఎంపీటీసీపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని గంగాధర్పై గతంలో పోలీస్ కేసు నమోదైంది. ఆ కేసు విషయమై రాజీకు రావాలని ఎంపీటీసీ భర్త కేశవ, ఎంపీటీసీ బంధువులను సదరు వ్యక్తి తుపాకీతో బెదిరించే ప్రయత్నం చేశాడు. తుపాకీతో బెదరింపులకు దిగడంపై స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. గంగాధర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.