ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో అదుపుతప్పిన కంటైనర్ లారీ.. కారు, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఆరుగురు ఉన్నారు. పలువురు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa