వర్షాలు, వరదలతో విలవిల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవి వదిలిపెట్టేలా కనపడటంలేదు. బంగాళాఖాతంలో సెప్టెంబరు మూడోవారంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రంవైపు కదిలే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగుతుండటంతో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశాలున్నాయని, ఈ ప్రభావంతోనే ఈనెల చివరివారంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.