మాజీ ఎంపీ నందిగం సురేష్ కుటుంబానికి వైయస్ జగన్ అండగా నిలిచారని, దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబు అయితే ఏకంగా.. ఒక ముద్దాయిని చూడడానికి జైలుకు వెళ్లారని వైయస్ జగన్‌ను ఉద్దేశించి అంటున్నారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకనా? అంటూ దుయ్యబట్టారు. ఏం గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లలేదా?. దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్నచూపు. అందుకే అలా మాట్లాడారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందోని ఫైర్ అయ్యారు. అక్రమంగా అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ పరిణామాలపై తాడేపల్లిలో మేరుగ స్పందించారు.