ఈనెల 17 నుంచి అక్టోబరు 2 గాంధీ జయంతి వరకు మూడు కీలక అంశాలతో ప్రజల్లోకి వెళుతున్నట్టు రాజమహేంద్రవరం కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం స్వచ్ఛతా హి సేవా-2024 గోడపత్రులను ఆవిష్క రించారు. నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని స్వచ్ఛ తా హి సేవా -2024 అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్, డీపీవో డి.రాంబాబు, సీపీవోఎల్ అప్పలకొండ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి.బాలశంకరరావు, డీఎంహెచ్వో కే.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.