వరద ప్రాంతాలలో సర్వీస్ అందించిన అగ్నిమాపక సిబ్బందిని పైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పైర్ డీజీ మాట్లాడుతూ.. బుడమేరు ప్రవాహంలో 32 వార్డులు పది రోజుల పాటు ఉన్నాయన్నారు. ఇంతటి విపత్తు రావడం తమకు తెలిసి ఇదే తొలిసారన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను రిస్క్యూ చేసి బయటకు తీసుకు వచ్చామని తెలిపారు.వృద్దులు, పిల్లలు, మహిళలను ఆస్పత్రికి తరలించడంలో అగ్నిమాపక సిబ్బంది బాగా పని చేశారని కొనియాడారు. లక్షా 25వేల మందికి అవసరమైన మందులు, భోజనం అందించామన్నారు. 13వేల మందిని వరదల నుంచి బయటకు తీసుకువచ్చామన్నారు. వరద వెళ్లిన అనంతరం బురదను పూర్తిగా శుభ్రం చేసేలా పని చేశామని తెలిపారు. తమ పని తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా అభినందించారన్నారు.