బైక్‌ను టెస్ట్ డ్రైవ్ పేరుతో ఉడాయించాడు ఓ దుండగుడు. ఈ సంఘటన ఒంగోలు నగరం భాగ్యనగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న గౌరిశెట్టి సుమత్‌నాయుడు తన ఓ ఖరీదైన బైక్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. ఈనెల 10న సుమత్‌నాయు డుకు వేర్వేరు నంబర్లతో ఫోన్ చేసి తమకు బైక్ కావాలని అడిగారు. ఈక్రమలో ఓ వ్యక్తి తాను గుంటూరు నుంచి వ చ్చానని, స్థానిక ప్రకాశంభవన్ వద్ద ఉన్నాని అదేరోజు అ ర్థరాత్రి 12.30 గంటలకు సుమత్‌నాయుడుకు ఫోన్ చేశాడు. దీంతో ఆయన అక్కడకు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తిని ఇంటికి వచ్చి బైక్‌ను చూపించాడు. అయితే టెస్ట్ డ్రైవ్ చేయాలంటూ బైక్ తీసుకుని ఆ దుండగుడు పరారయ్యాడు. దీంతో మోసం జరిగిందని గ్రహించిన సుమత్‌నాయుడు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.