తిరుపతిలో 18 నెలల బాలుడు అదృశ్యమయ్యాడు. ఈస్ట్ సీఐ మహేశ్వర రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నేపాల్‌కు చెందిన కైలాస్, మౌనీషా దంపతులు 20 ఏళ్ల కిందట తిరుపతికి వలస వచ్చారు. శ్రీనివాసపురంలోని గోకుల నిలయంలో కైలాస్ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి 18 నెలల బాలుడు బాలాజీ ఉన్నాడు. భార్య, బిడ్డతో కలిసి బుధవారం రాత్రి బజారులో నిత్యావసరాలు కొనుగోలు చేసి, ఇంటికెళ్లడానికి ఆటో ఎక్కాడు. అప్పటికే ఫూటుగా మద్యం తాగి ఉన్న కైలాస్.. టౌన్‌బ్యాంకు ఎదురుగా ఉన్న వినాయకస్వామి ఆలయం వద్దకొచ్చేసరికి ఆటోని ఆపి దిగేశాడు. భర్త దిగిపోవడంతో కంగారుగా బిడ్డను చూసుకోకుండా భార్య కూడా ఆటో దిగేసింది. కొంతసేపటికి బిడ్డ కనిపించలేదని దంపతులు గుర్తించి చుట్టుపక్కల వెతికాడు. ఫలితం లేకపోవడంతో గురువారం ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ సుబ్బరాయుడి ఆదేశాలతో రెండు ప్రత్యేక టీమ్‌ల ద్వారా డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో సీఐ మహేశ్వరరెడ్డి గాలింపు చర్యలు చేపట్టారు.